జిల్లాలోని సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(68) కొద్ది సేపటి క్రితం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నారు. తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమ నాయకుడిగా 2009, 2011 సంవత్సరంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.