ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యేను ట్రాఫిక్ కష్టాలు చుట్టుముట్టాయి. ఎంతలా అంటే ఏకంగా ఆయన ఇంటినే ఖాళీ చేసి పోయేంత. అవును మీరు విన్నది నిజమే. యూపీలోని షామ్లి జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన చక్కెర కర్మాగారానికి దగ్గరగా కైరానా మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ బన్సాల్ ఇల్లు ఉంది. అయితే ప్రతీరోజు వందల కొద్దీ చెరుకు లోడ్ బండ్లు రాజేశ్వర్ బన్సాల్ ఇంటి దగ్గర నుంచే షూగర్ ఫ్యాక్టరీకి వెళ్తుంటాయి.
రోడ్డంతా చెరుకు బండ్లతో నిండిపోయి కిక్కిరిసిపోతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ట్రాఫిక్ జామ్‌తో చాలా సమస్యగా ఉందని, తన ఇంటిని అమ్మి కుటుంబంతో కలిసి దూరంగా వెళ్లిపోతానని రాజేశ్వర్ బన్సాల్ అంటున్నారు. అయితే ఈ విషయమై షుగర్ మిల్స్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని షామ్లి జిల్లా మేజిస్ట్రేట్ జస్జీత్ కౌర్ తెలిపారు.