ప్రగతి నిరంతర ప్రక్రియలో ప్ర జలు భాగస్వాములు కావాలని కలెక్టర్ గుగులోత్ రవి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుం లాపూర్, నాగులపేట, అయిలాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూడు గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠధామాలను, కంపోస్టుషెడ్లను పరిశీలించి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాగా గుంలాపూర్‌లోని నర్సరీలను పరిశీలించి ఎలాంటి మొక్కలను పెంచుతున్నారని అడి గి గ్రామానికి సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించా రు. నాగుల పేటలో నర్సరీ, వైకుంఠధామం, డం ప్‌యార్డును పరిశీలించి రోడ్డుకు ఇరువైపులా నాటి న మొక్కలను పరిశీలించి ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. నాగులపేట సైఫాన్‌ను సందర్శించి అక్కడ చేపట్టిన అభివృద్ధ్ది పనులను పరిశీలించా రు. అయిలాపూర్ గ్రామ శివారులో మంకిఫుఢ్ కోర్టును సందర్శించి మొక్కలకు రోజువారికి నీటినందించాలన్నారు. మొక్కలకు రక్షణగా కంచెలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాగా ప్రతి గ్రామం లో ఇంటింటికీ సర్వే నిర్వహించి మొక్కలను అం దించాలన్నారు. గ్రామాల్లో వందశాతం ఇంటి ప న్నులను వసూలు చేయాలన్నారు. కాగా కలెక్టర్ ను ప్రజాప్రతినిధులు శాలువా పూలమాలతో ఘ నంగా సన్మానించారు. ఈ కార్యాక్రమంలో డీఆర్డీపీడీ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, సర్పంచులు యాదగిరి అమ్మా యి, కేతిరెడ్డి బాస్కర్‌రెడ్డి, పిడుగు రాధ, సింగిల్ విండో అధ్యక్షుడు సింగిరెడ్డి నర్సారెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎండీ ఖయ్యూం, ఎంపీఓ నీరజ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
‘ప్రగతి’పై నిర్లక్ష్యం వద్దు